Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Kadai Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే క‌డై ప‌నీర్‌ను.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

D by D
August 17, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kadai Paneer : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో క‌డాయి ప‌నీర్ కూడా ఒక‌టి. క‌డాయి ప‌నీర్ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చ‌పాతీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌డాయి ప‌నీర్ కర్రీని రెప్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ప‌నీర్ ఉంటే చాలు నిమిషాల వ్వ‌వ‌ధిలోనే ఈ క‌ర్రీని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ క‌డాయి ప‌నీర్ క‌ర్రీని ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌డాయి ప‌నీర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టీ స్పూన్స్, పనీర్ – 200 గ్రా., త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం – ఒక ఇంచు ముక్క‌, జీడిప‌ప్పు – 10, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ట‌మాట ముక్క‌లు – అర క‌ప్పు, బ‌ట‌ర్ – ఒక టీ స్పూన్, బిర్యానీఆకు – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, పెట‌ల్స్ లాగా త‌రిగిన ఉల్లిపాయ – 1, పెట‌ల్స్ లాగా తరిగిన క్యాప్సికం – 1, నీళ్లు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Kadai Paneer recipe in telugu make in this method
Kadai Paneer

మ‌సాలా త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, మిరియాలు – అర‌ టీ స్పూన్, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌.

క‌డాయి ప‌నీర్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌నీర్ ముక్క‌లు వేసి రంగు మారే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ‌లు, జీడిప‌ప్పు, ట‌మాట ముక్క‌లు, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో బ‌ట‌ర్, నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత బిర్యానీ ఆకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి.

త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి అవి మెత్త‌బడే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత నీళ్లు, క‌సూరి మెంతి, మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని 3 నిమిషాల‌పాటు ఉడికించిన త‌రువాత ప‌నీర్ ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రెస్టారెంట్ స్టైల్ క‌డాయి ప‌నీర్ త‌యార‌వుతుంది. దీని రుచికి అంద‌రూ ఫిదా అవ్వాల్సిందే.

Tags: Kadai Paneer
Previous Post

Glass Bowls : ఈ పాత్ర‌ల్లో వండిన వంట‌ల‌ను తింటున్నారా.. అయితే విషం మీ శ‌రీరంలోకి చేరుతుంది జాగ్ర‌త్త‌..!

Next Post

Kobbari Burelu : నోరూరించే కొబ్బ‌రి బూరెల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Related Posts

వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025
lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.