Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Kaju Mushroom Masala Curry : జీడిప‌ప్పు, పుట్ట గొడుగుల‌తో చేసే ఈ కూర‌.. చ‌పాతీల్లో తింటే వ‌హ్వా అంటారు..

D by D
December 19, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kaju Mushroom Masala Curry : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను అలాగే అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో పుట్ట గొడుగులు ఒక‌టి. ఇవి మ‌న‌నంద‌రికి తెలిసిన‌వే. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల‌ను అందించ‌డంలో పుట్ట‌గొడుగులు మ‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటితో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా దాబా స్టైల్ లో కాజు మ‌ష్రూమ్ కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దాబా స్టైల్ కాజు మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన పుట్ట గొడుగులు – పావు కిలో, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Kaju Mushroom Masala Curry recipe in telugu very tasty
Kaju Mushroom Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, జాప‌త్రి – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు – రెండు టేబుల్ స్పూన్స్.

దాబా స్టైల్ కాజ్ మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పుట్ట‌గొడుగు ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో జీడిప‌ప్పును వేసి వేయించాలి. దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్, ట‌మాట ముక్క‌లు వేసి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత దానిలో మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా, ప‌సుపు వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత వేయించిన పుట్ట గొడుగు ముక్క‌లు, జీడిప‌ప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క‌సూరి మెంతి, క‌రివేపాకు, కొత్తిమీర వేసి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్ కాజు మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, నాన్. పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పుట్టగొడుగుల‌తో ఈ విధంగా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు పుట్ట గొడుగును తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Kaju Mushroom Masala Curry
Previous Post

Guntagalagara For Hair : మీ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..

Next Post

Sunflower Seeds : రోజూ ఈ ప‌ప్పును గుప్పెడు నాన‌బెట్టుకుని తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.