vastu

Vastu Tips : ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటేచాలు.. సిరి సంపదలు మీ వెంటే..!

Vastu Tips : సాధారణంగా మనం మన జీవితంలో ఎంతో సంతోషంగా గడపాలంటే డబ్బు ఎంతో అవసరం. ఈ క్రమంలోనే చాలా మంది ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తుంటారు. అయితే ఇలా సంపాదించిన డబ్బు వచ్చినట్టుగానే వచ్చి వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు నిల్వ లేకపోతే ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక ఎదుగుదల ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందామా..!

భూమిపై ఉన్న పక్షులలో నెమలిని ఎంతో అందమైన పక్షిగా భావిస్తారు. అంతేకాకుండా నెమలిని సాక్షాత్తు లక్ష్మీ, సరస్వతి స్వరూపంగా భావిస్తారు. కనుక మన ఇంట్లో నెమలి ఈక ఉండటం ఎంతో మంచిది. అదే విధంగా నెమలి నాట్యమాడుతున్నటువంటి విగ్రహాలు మన ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

keep this one item in your home for money

ముఖ్యంగా నెమలి వెండి విగ్రహాన్ని మన ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని, అదే విధంగా మన ఇంట్లో డబ్బు నిల్వ చేసే పెట్టెను నైరుతి లేదా దక్షిణ గోడకు పెట్టుకోవడం ఎంతో ముఖ్యమని పండితులు తెలియజేస్తున్నారు. తప్పుడు మార్గాలలో డబ్బులు సంపాదించి ఈ వాస్తు నియమాలను పాటించిన వారి దగ్గర డబ్బు నిలవదని పండితులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts