Kempula Pulao : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌, రుచిక‌ర‌మైన కెంపుల పులావ్‌.. త‌యారీ ఇలా..!

Kempula Pulao : కెంపు బియ్యం.. వీటినే ఎర్ర‌బియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యం చూడ‌డానికి ఎర్ర‌గా కొద్దిగా లావుగా ఉంటాయి. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌పడే వారు ఈ బియ్యాన్ని తిన‌డం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోఉంటాయి. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ప్ర‌తిఒక్క‌రు ఈ బియ్యాన్ని వారానికి ఒక‌టి నుండి రెండు సార్లు త‌ప్ప‌కుండా తీసుకోవాలి.చాలా మంది ఇప్ప‌టికే ఎర్ర‌బియ్యంతో అన్నాన్ని వండుకుని తింటున్నారు. అయితే కేవ‌లం అన్నమే కాకుండా ఈ బియ్యంతో మ‌నం పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కెంపుల‌తో ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కెంపులతో రుచిగా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కెంపుల పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన బీన్స్ – 4, ఉప్పు – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, లవంగాలు – 2, యాల‌కులు -2 , అనాస పువ్వు – 1, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, బిర్యానీ ఆకు – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, 2 గంట‌ల పాటు నాన‌బెట్టిన కెంపు బియ్యం( ఎర్ర‌బియ్యం) – ఒక క‌ప్పు, నీళ్లు – 3 క‌ప్పులు.

Kempula Pulao recipe in telugu very healthy and tasty
Kempula Pulao

కెంపుల పులావ్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, బంగాళాదుంప‌లు, క్యారెట్ ముక్క‌లు, బీన్స్, ఉప్పు వేసి వేయించాలి. వీటిని స‌గానికి పైగా వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే గిన్నెలో నెయ్యివేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలాదినుసులు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన‌త‌రువాత అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, త‌గినంత ఉప్పు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి.

నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యంవేసి క‌ల‌పాలి. బియ్యం 80 శాతం ఉడికిన త‌రువాత వేయించిన కూర‌గాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి అన్నం మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కెంపుల పులావ్ త‌యార‌వుతుంది. దీనిని ఏ కూర‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా కెంపులతో పులావ్ ను చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts