Kodiguddu Porutu : తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. ఈ కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే చేసుకోదగిన వంటకాల్లో కోడిగుడ్డు పొరుటు ఒకటి. దీనిని కేవలం 5 నిమిషాల్లోనే మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు బ్యాచిలర్స్ కూడా దీనిని సులువుగా తయారు చేయగలరు. ఎంతో రుచిగా ఉండే ఈ కోడిగుడ్డు పొరుటును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు పొరుటు తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్.
కోడిగుడ్డు పొరుటు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లను వేసి కలపాలి. ఈ కోడిగుడ్లను కలుపుతూ బాగా వేయించాలి. కోడిగుడ్లు వేగిన తరువాత ఒక్కొక్కటిగా మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పొరుటు తయారవుతుంది. ఈ కోడిగుడ్డు పొరుటును అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సమయం ఎక్కువగా లేనప్పుడు, వంట ఏం చేయాలో తోచనప్పుడు ఇలా చాలా తక్కువ సమయంలో రుచిగా కోడిగుడ్డు పొరుటును తయారు చేసుకుని తినవచ్చు.