Kodiguddu Pulusu : కోడిగుడ్డు పులుసును ఇలా చేస్తే.. ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు..!

Kodiguddu Pulusu : కోడిగుడ్డుతో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కోడిగుడ్డుతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. కోడిగుడ్డుతో ఎంతో మ‌నం పులుసు కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే పులుసు కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్డు పులుసును మ‌రింత రుచిగా అంద‌రూ ఇష్ట‌ప‌డేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్డు పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 5, నూనె – 4 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మెంతులు – 6 గింజ‌లు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – 4 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), బిర్యానీ ఆకులు – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Kodiguddu Pulusu recipe in telugu tastes better with rice
Kodiguddu Pulusu

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 4.

కోడిగుడ్డు పులుసు త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని అందులోనే వెల్లుల్లి రెబ్బ‌లను కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, మెంతులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత క‌రివేపాకు, బిర్యానీ ఆకు వేసి పూర్తిగా వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత చింత‌పండు గుజ్జు, ఒక‌టిన్న‌ర గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి మూత పెట్టి మ‌రో రెండు నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌కు టూత్ పిక్ తో చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకుని పులుసులో వేసుకోవాలి.

ఈ పులుసును ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి కొత్తిమీర‌ను చ‌ల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే కోడిగుడ్డు పులుసు కంటే ఈ విధంగా చేసిన కోడిగుడ్డు పులుసు కూర మ‌రింత రుచిగా ఉంటుంది. కోడిగుడ్డుతో ఈ విధంగా పులుసును చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు కోడిగుడ్డులోని పోష‌కాల‌ను, కోడిగుడ్డును తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts