Left Over Rice Murukulu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. ఇలా మురుకులు చేయండి..!

Left Over Rice Murukulu : మ‌నం సాధార‌ణంగా వేడిగా ఉన్న అన్నాన్నే తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తాము. కానీ కొన్నిసార్లు ఇంట్లో అన్నం ఎక్కువ‌గా మిగిలిపోతూ ఉంటుంది. ఇలా మిగిలిన అన్నాన్ని తిన‌డానికి ఎవ‌రూ మక్కువ చూపించ‌రు. ఇలా మిగిలిన అన్నాన్ని ప‌డేయ‌కుండా దానితో మ‌నం ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే మురుకుల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మురుకుల‌ను తయారు చేయ‌డం చాలా సుల‌భం. మిగిలిన అన్నంతో ఎప్పుడూ పులిహోర‌, ఫ్రైడ్ రైస్ వంటి వాటినే కాకుండా ఇలా మురుకుల‌ను కూడా త‌యారు చేసుకోవచ్చు. మిగిలిన అన్నంతో క్రిస్పీగా ఉండే మురుకుల‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ మురుకుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – ఒక క‌ప్పు, శ‌న‌గ‌పిండి – అర క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, నువ్వులు -ఒక టేబుల్ స్పూన్, వాము – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Left Over Rice Murukulu recipe in telugu make in this method
Left Over Rice Murukulu

రైస్ మురుకుల త‌యారీ విధానం..

ముందుగా అన్నాన్ని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా మిక్సీ ప‌ట్టుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని నూనె రాసి పిండిని అందులో ఉంచాలి. త‌రువాత ఒక పాలిథిన్ క‌వ‌ర్ మీద లేదా వ‌స్త్రంపై మురుకుల‌ను వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని వత్తుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముర‌కుల‌ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల రైస్ మురుకులు త‌యార‌వుతాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఈ మురుకులు చాలా చ‌క్క‌గా ఉంటాయి. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే మురుకుల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts