Allam Garelu : మినుములతో చేసే గారెలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చేస్తుంటారు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మినప గారెలను చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తింటారు. అయితే వీటిలోనే అల్లం బాగా వేసి మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇవి అందరికీ ఎంతగానో నచ్చుతాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినుములు – 500 గ్రా., అల్లం – 200 గ్రా., పచ్చిమిర్చి – 3, జీలకర్ర – ఒక టీస్పూన్, ఉల్లిగడ్డలు – 2, కరివేపాకు – 2 రెమ్మలు, నూనె, ఉప్పు – తగినంత.
అల్లం గారెలను తయారు చేసే విధానం..
మినుములను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. పిండిని చిన్న చిన్న గారెల్లాగా చేసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇలా మిశ్రమం మొత్తం చేసుకోవాలి. దీంతో రుచికరమైన గారెలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.