Jaggery : ప్రస్తుతం చక్కెర వాడకం అధికమైంది. దీంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. చక్కెరను అధికంగా తినడం వల్ల అధికంగా బరువు పెరగడమే కాకుండా.. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. అయితే చక్కెరకు ప్రత్యామ్నాయంగా మనం బెల్లాన్ని తినవచ్చు. చక్కెర అందించే తీపి రుచిని ఇవ్వడంతోపాటు బెల్లం మనకు అనేక లాభాలను అందిస్తుంది. ఇక బెల్లాన్ని ఎలా ఉపయోగిస్తే.. ఏయే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన అనంతరం చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలితే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే అజీర్తి నుంచి బయట పడవచ్చు. తిన్న ఆహారం సులభంగా, త్వరగా జీర్ణమవుతుంది. దీంతోపాటు మలబద్దకం ఉండదు. ఆకలి లేని వారికి ఆకలి బాగా అవుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేసే గుణం బెల్లంకు ఉంటుంది. అందువల్ల రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను తింటే రక్తం శుభ్రపడుతుంది. అలాగే బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
రోజూ బెల్లం తినడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే చర్మం కూడా శుభ్రంగా మారుతంది. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే రోజంతా నీరసంగా, బలహీనంగా ఉందని భావించే వారు బెల్లం తినాలి. దీంతో శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీంతో యాక్టివ్‌గా మారుతారు. నీరసం పోతుంది. చురుగ్గా పనిచేస్తారు. అలాగే బెల్లం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి సులభంగా బయట పడవచ్చు.
బెల్లం ముక్కను నెయ్యితో కలిపి తింటే శరీరానికి అమితమైన బలం లభిస్తుంది. ముఖ్యంగా పురుషులు ఇలా తింటే వారిలో శృంగార సమస్యలు పోతాయి. వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. బెల్లం ముక్కను శొంఠితో తింటే మోకాళ్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. కనుక బెల్లాన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.