Ravva Kesari : ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ కేస‌రి.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Ravva Kesari : మ‌నం వంటింట్లో బొంబాయి ర‌వ్వ‌ను ఉప‌యోగించి వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తయారు చేస్తూ ఉంటాం. ఎక్క‌వ‌గా మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ఉప్మాను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం ఉప్మానే కాకుండా బొంబాయి ర‌వ్వ‌తో మ‌నం ర‌వ్వ ల‌డ్డూలు, ర‌వ్వ కేస‌రి వంటి తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బొంబాయి ర‌వ్వ‌తో చేసే ర‌వ్వ కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. బొంబాయి ర‌వ్వ‌తో ర‌వ్వ కేస‌రిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ కేస‌రి తయారీకి కావ‌ల్సిన పదార్థాలు..

బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, నెయ్యి – పావు క‌ప్పు, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, నీళ్లు – 3 క‌ప్పులు, పంచ‌దార – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఎల్లో ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

make Ravva Kesari in this way recipe is here
Ravva Kesari

ర‌వ్వ కేసరి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పును, ఎండుద్రాక్ష‌ను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో బొంబాయి ర‌వ్వ‌ను కూడా వేసి చిన్న మంట‌పై కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో నీళ్లు పోసి నీళ్ల‌ను మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ముందుగా వేయించిన బొంబాయి ర‌వ్వ‌ను కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

త‌రువాత క‌ళాయి పై మూత ఉంచి 2 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మూత తీసి పంచ‌దార‌ను వేయాలి. పంచ‌దార‌ వేసిన త‌రువాత మ‌ర‌లా ఉండ‌లు లేకుండా పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగి రవ్వ మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత నెయ్యి వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత యాల‌కుల పొడిని, ఫుడ్ క‌ల‌ర్ ను వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా.. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ కేస‌రి త‌యార‌వుతుంది. బొంబాయి ర‌వ్వ‌తో త‌ర‌చూ చేసే ఉప్మా వంటి వంట‌ల‌కు బ‌దులుగా ఇలా కేస‌రిని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. తీపి తినాలనిపించిన‌ప్పుడు ఇలా చాలా త్వ‌ర‌గా, రుచిగా.. ర‌వ్వ కేస‌రిని చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts