Manchu Lakshmi : టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ నటిగా మంచు లక్ష్మీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. కొన్ని మూవీల్లో లీడ్ రోల్స్‌ను పోషించింది. కానీ ఇప్పటి వరకు ఆమె దశాబ్ద సినీ కెరీర్‌లో తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఎన్నడూ నటించలేదు. కానీ ఎట్టకేలకు ఆ కలను నెరవేర్చుకుంది.

తన తండ్రి మోహన్ బాబు సినిమాలో తాను నటిస్తున్నానని మంచు లక్ష్మి తెలియజేసింది. అయితే ఆ మూవీ ఏంటి, ఇతర వివరాలు ఏమిటన్నది ప్రకటించలేదు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి పలు వివరాలను ట్వీట్ ద్వారా తెలియజేసింది.
తాను ఎంతో కాలం నుంచి తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఒక సినిమాలో నటించాలని అనుకుంటున్నానని.. కానీ ఆ కల నెరవేరలేదని.. అయితే ఇప్పుడు ఆయనతో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. తనకు మొదటి హీరో తన తండ్రేనని స్పష్టం చేసింది. తన కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది.
తనకు ఈ ప్రపంచం, తన కుటుంబ పెద్దలు దారి చూపిస్తున్నారని, అందుకు సంతోషంగా ఉందని మంచు లక్ష్మి తెలిపింది. తాను కన్న కలలు నిజం అవుతున్నందుకు ఆనందంగా ఉందని, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని చెప్పుకొచ్చింది. కాగా మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా తాజాగా గ్రాండ్‌గా నిర్వహించారు.