Pimples : ముఖంపై మొటిమలు ఉంటే ఎవరికీ నచ్చదు. నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే మొటిమలు త్వరగా తగ్గుతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. సాధారణంగా చాలా మంది యాస్పిరిన్ ట్యాబ్లెట్లను నొప్పిని తగ్గించేందుకు వేసుకుంటుంటారు. అయితే ఇవి మొటిమలను కూడా తగ్గించగలవు. అందుకు ఏం చేయాలంటే.. ఒక యాస్పిరిన్ ట్యాబ్లెట్ తీసుకుని దాన్ని పౌడర్‌లా చేయాలి. అనంతరం అందులో ఒక టీస్పూన్ గోరు వెచ్చని నీటిని కలిపి పేస్ట్‌లా చేయాలి. తరువాత ఆ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేయాలి. 15-20 నిమిషాలు ఆగాక ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయాలి. దీంతో మొటిమలు వెంటనే తగ్గిపోతాయి.
2. ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లో ఐస్ క్యూబ్‌లను తయారు చేసుకోవాలి. వీటితో మొటిమలపై మర్దనా చేయాలి. ఒక సన్నని శుభ్రమైన వస్త్రంలో ఒక ఐస్ క్యూబ్ వేసి చుట్టి దాంతో మొటిమలపై సుమారుగా 20 సెకన్ల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా 2-3 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మొటిమలను తగ్గించుకోవచ్చు. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
3. మొటిమలను తగ్గించడంలో అలొవెరా (కలబంద) గుజ్జు అద్భుతంగా పనిచేస్తుంది. తాజా కలబంద గుజ్జును ఆకుల నుంచి సేకరించి దాన్ని మొటిమలపై రాయాలి. రాత్రి పూట మొటిమలపై కలబంద గుజ్జును రాయాలి. సున్నితంగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమలు వెంటనే తగ్గిపోతాయి.