Menthikura Pappu : క‌మ్మ‌నైన మెంతికూర పప్పు.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Menthikura Pappu : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర‌లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. మెంతికూరను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వేయ‌డంతో పాటు మెంతికూర‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మెంతికూర‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మెంతికూర పప్పు కూడా ఒక‌టి. మెంతికూర ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇత‌ర ఆకుకూర‌ల ప‌ప్పు వ‌లె మెంతికూర ప‌ప్పును కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. దీనిని కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూర‌తో రుచిగా ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతికూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన మెంతికూర క‌ట్ట – 1(మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన ట‌మాట – 1, కారం – ఒక టీ స్పూన్, నాన‌బెట్టిన కందిప‌ప్పు – అర క‌ప్పు, నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు.

Menthikura Pappu recipe very easy to make how to do
Menthikura Pappu

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కసూరిమెంతి – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ప‌సుపు పావు టీ స్పూన్, ఇంగువ‌- పావు టీ స్పూన్.

మెంతికూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత మెంతికూర వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత పసుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, కందిప‌ప్పు వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత చింత‌పండు పులుసు, నీళ్లు పోసి క‌లపాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత మిగిలిన తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ తాళింపును ముందుగా ఉడికించిన ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts