Methi Rice : లంచ్ బాక్స్‌లోకి మేథీ రైస్‌ను ఇలా చేయండి.. చాలా త్వ‌ర‌గా అవుతుంది..!

Methi Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో మేతి రైస్ కూడా ఒక‌టి. మెంతికూర‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ రైస్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. మెంతికూర తిన‌ని వారు కూడా ఈ రైస్ ను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. నోటికి ఎంతో రుచిగా ఉండ‌డంతో పాటు సుల‌భంగా చేసుకోద‌గిన ఈ మేతి రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మేతి రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, క్యాబేజి తురుము – పావు క‌ప్పు, త‌రిగిన క్యారెట్ – 1, చిన్న‌గా త‌రిగిన బీన్స్ – 4, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, మెంతిఆకులు – గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, అన్నం – 2 క‌ప్పులు, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

Methi Rice recipe for lunch box make like this
Methi Rice

మేతి రైస్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, క్యాబేజి, క్యారెట్, బీన్స్ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మెంతిఆకులు వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత అన్నం వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మేతి రైస్ త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts