Minapapappu Pachadi : మినపప్పుతో మనం ఎక్కువగా అల్పాహారాలను, పిండి వంటకాలను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మినపప్పుతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే తరుచూ చేసే వంటకాలతో పాటు మినపప్పుతో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ మినపప్పు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినపప్పు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, పొట్టు మినుములు – అర కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 8 నుండి 10, మెంతులు – అర టీ స్పూన్, చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, బెల్లం – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 5, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
మినపప్పు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినపప్పు వేసి వేయించాలి.దీనిని 15 నిమిషాల పాటు దోరగా అయ్యే వరకు వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో మెంతులు వేసి వేయించాలి. మెంతులు దోరగా వేగిన తరువాత చింతపండు వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో ఉప్పు, బెల్లం, వెల్లుల్లి రెమ్మలు కూడా వేడి నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినపప్పు పచ్చడి తయారవుతుంది. దీనిని ఏ అల్పాహారాలతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రుచిగా, కమ్మగా మినపప్పుతో పచ్చడిని తయారు చేసి తీసుకోవచ్చు.