Money In Dream : సాధారణంగా మనకు రోజూ అనేక రకాల కలలు వస్తుంటాయి. అసలు కలలు రాని మనిషి అంటూ ఉండడు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కొందరికి చిత్రాతి చిత్రమైన కలలు వస్తాయి. కొందరికి పీడ కలలు వస్తాయి. కొందరికి గడిచిన సంఘటనలు లేదా రోజువారీ జరిగే సంఘటనలకు చెందిన కలలు వస్తాయి. అయితే కలలో కొన్ని రకాల వస్తువులు లేదా ఇతర ఏవైనా కనిపిస్తే.. అప్పుడు వారు త్వరలోనే ధనవంతులు అవబోతున్నారని అర్థం. మరి ఎలాంటి కలలు వస్తే.. ధనవంతులు అవబోతున్నారని అర్థమో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
కలలో సూర్యుడు కనిపించాడంటే త్వరలోనే మీకు కొంత ధనం రాబోతుందని సంకేతం. అంతేకాదు చాలా ప్రకాశవంతంగా సూర్యుడు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ జీవితం అత్యంత డబ్బుతో నిండిపోతుందట. అంటే కోటీశ్వరులు అవుతారని అర్థం. అలాగే కలలో చంద్రుడు కనిపించినా కూడా త్వరలోనే ధనవంతులు అవుతారని అర్థం చేసుకోవాలి. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు సంకేతం. కాబట్టి మీలో కోపం తగ్గుతుందని కూడా ఆ కల సూచిస్తుంది.
అలాగే కలలో జుట్టు రాలుతున్నట్టు చూశారంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ధనవంతులు కానున్నారనే దానికి సంకేతంగా ఈ కల వస్తుంది. ఇక ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లుగా కల వచ్చినా కూడా త్వరలోనే ధనం సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి. దీంతోపాటు పర్సులో పెట్టుకునే కార్డులు, ఇతర వస్తువులను కలలో చూసినా కూడా మీకు ధనం వస్తుందని గుర్తించాలి.
ఇక కలలో ఆవు కనిపించినా, లేదంటే ఆవు పాలిస్తున్నట్టు కలలో చూసినా వారు త్వరలోనే ధనవంతులు అవుతారని తెలుసుకోవాలి. దీంతోపాటు బంగారం కలలో కనిపించినా వారు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం చేసుకోవాలి. కలలో అద్దాలు (పగిలిపోనివి) కనిపించినా, పాయసం తాగుతున్నట్లు కల వచ్చినా వారు ధనవంతులు అవుతారట. ఇలాంటి వారికి ధనం త్వరగా వచ్చి వారు త్వరగా ధనవంతులు అవుతారట.