Multigrain Roti : అన్ని ర‌కాల చిరుధాన్యాల‌ను క‌లిపి రొట్టెల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Multigrain Roti : రొట్టెలు.. చపాతీలు.. పేరు ఏది చెప్పినా స‌రే.. మ‌నం రెగ్యుల‌ర్‌గా ఇంట్లో గోధుమ పిండితోనే వీటిని త‌యారు చేస్తుంటాం. బ‌య‌ట మ‌నం తినే రొట్టెలు లేదా చ‌పాతీల్లో మైదాను అధికంగా వాడుతారు. క‌నుక బ‌య‌ట వీటిని తిన‌కూడ‌ద‌ని చెబుతుంటారు. అయితే కేవ‌లం గోధుమ‌లు ఉప‌యోగించి మాత్ర‌మే కాదు.. వాటితో అన్ని ర‌కాల చిరుధాన్యాల‌ను క‌లిపి పిండిలా చేసి దాంతో రొట్టెల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు. ఆరోగ్య‌క‌రం కూడా. ఈ మ‌ల్టీగ్రెయిన్ రోటీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ల్టీ గ్రెయిన్ రోటీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జొన్న పిండి – పావు క‌ప్పు, స‌జ్జ పిండి – పావు క‌ప్పు, గోధుమ పిండి – పావు క‌ప్పు, శ‌న‌గ పిండి – 2 టేబుల్ స్పూన్లు, రాగి పిండి – పావు క‌ప్పు, ఉల్లిముక్క‌లు – పావు క‌ప్పు, కొత్తిమీర తురుము – 3 టేబుల్ స్పూన్లు, ట‌మాటా – పావు క‌ప్పు, ప‌చ్చి మిర్చి ముక్క‌లు – 1 టీస్పూన్‌, కారం – 1 టీస్పూన్‌, ప‌సుపు – పావు టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – వేయించ‌డానికి స‌రిప‌డా.

Multigrain Roti recipe in telugu make in this method
Multigrain Roti

మ‌ల్టీ గ్రెయిన్ రోటీల‌ను త‌యారు చేసే విధానం..

ఒక గిన్నెలో అన్ని ర‌కాల పిండిల‌ను క‌లిపి త‌గిన‌న్ని నీళ్లు పోసి మిశ్ర‌మంలా చేయాలి. త‌రువాత పిండిని బాగా క‌లిపి ముద్ద‌లా చేయాలి. దీన్ని మ‌ళ్లీ ఉండ‌ల్లా చేసుకోవాలి. వీటిని ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్‌పై నెయ్యి లేదా నూనె వేసి అనంత‌రం చేత్తో వ‌త్తుతూ రొట్టెల్లా చేయాలి. వీటిని నాన్ స్టిక్ పెనం మీద వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన మ‌ల్టీ గ్రెయిన్ రోటీలు రెడీ అవుతాయి. వీటిని ఏ కూర‌తో అయినా స‌రే తిన‌వ‌చ్చు. ఇలా అన్ని ర‌కాల చిరు ధాన్యాల‌తో రొట్టెల‌ను చేసి తిన‌డం వ‌ల్ల అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు న‌యం అవుతాయి.

Share
Editor

Recent Posts