Mushroom Tomato Masala : పుట్ట‌గొడుగులు, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా కూర చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Mushroom Tomato Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల మ‌సాలా వంట‌కాల్లో మ‌ష్రూమ్ ట‌మాట మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ,నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. మ‌నం కూడా ఈ క‌ర్రీని అదే రుచితో ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల రెస్టారెంట్ ల‌లో ల‌భించే మ‌ష్రూమ్ క‌ర్రీని ఇంట్లోనే చాలా సుల‌భంగా, తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే మ‌ష్రూమ్ ట‌మాట మ‌సాలా కర్రీని అదే రుచితో అదే స్టైల్ లో ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ష్రూమ్ ట‌మాట మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన పుట్ట‌గొడుగులు – 200 గ్రా., ట‌మాటాలు – 4, ప‌చ్చిమిర్చి – 2, యాల‌కులు – 2, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క‌- ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – చిన్న‌ది ఒక‌టి, జీడిప‌ప్పు – 10 నుండి 15, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీకారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – అర టీ స్పూన్, పంచ‌దార – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్.

Mushroom Tomato Masala recipe in telugu very tasty
Mushroom Tomato Masala

మ‌ష్రూమ్ ట‌మాట మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత మ‌ష్రూమ్ వేసి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత స్ట‌వ్ చేసి మ‌ష్రూమ్ ను తీసుకుని చ‌ల్ల‌టి నీటిలో వేసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు జార్ లో ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, బిర్యానీ ఆకు, యాల‌కులు, జీడిప‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె, బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, కాశ్మీరి కారం, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కసూరిమెంతి, పంచ‌దార వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన మ‌ష్రూమ్ వేసి క‌ల‌పాలి.దీనిపై మూత పెట్టి మ‌రో 3 నుండి 4 నిమిషాల వ‌ర‌కు ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌, క్రీమ్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ష్రూమ్ ట‌మాట మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా రెస్టారెంట్ ల‌లో ల‌భించే మ‌ష్రూమ్ కర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts