Mutton Soup : చ‌లికాలంలో వేడి వేడిగా ఇలా మ‌ట‌న్ సూప్‌ను చేసి తాగండి.. బాగుంటుంది..

Mutton Soup : నాన్ వెజ్ ప్రియులు చాలా మంది వివిధ ర‌కాల మాంసాహారాల‌ను తింటుంటారు. కొంద‌రికి గుడ్లు అంటే ఇష్టంగా ఉంటుంది. కొంద‌రు చికెన్‌తో చేసిన వంట‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు చేప‌ల‌ను తింటే.. కొంద‌రు రొయ్య‌ల‌ను ఎక్కువ‌గా తింటారు. ఇక కొంద‌రు మాత్రం మ‌ట‌న్ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. మ‌ట‌న్‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకోవ‌చ్చు. అయితే మ‌ట‌న్‌తో మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన సూప్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్య‌క‌రం కూడా. మ‌ట‌న్‌తో సూప్‌ను త‌యారు చేసి చ‌లికాలంలో తాగితే మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక మ‌ట‌న్ సూప్‌ను మ‌నం ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – పావు కిలో (కీమా అయితే మంచిది), దాల్చిన చెక్క – 1 ముక్క‌, ల‌వంగాలు – 3, ఉల్లికాడ‌లు – 5, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, స‌న్న‌గా త‌రిగిన ట‌మాటా – అర క‌ప్పు, సోంపు గింజ‌ల పొడి – అర టీస్పూన్‌, మిరియాల పొడి – అర టీస్పూన్‌, ఉప్పు – అర టీస్పూన్‌, నిమ్మ‌ర‌సం – 1 టీస్పూన్‌, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (స‌న్న‌గా త‌ర‌గాలి), నీళ్లు – త‌గిన‌న్ని, నెయ్యి – త‌గినంత‌.

Mutton Soup recipe in telugu make in this way very tasty
Mutton Soup

మ‌ట‌న్ సూప్‌ను త‌యారు చేసే విధానం..

ఒక కుక్క‌ర్‌ను తీసుకుని అందులో మ‌ట‌న్‌, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, ఉల్లికాడలు, క‌రివేపాకులు, ట‌మాటా ముక్క‌లు, సోంపు గింజ‌ల పొడి, ఉప్పు, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు త‌గిన‌న్ని నీళ్ల‌ను పోయాలి. అనంత‌రం కుక్క‌ర్‌పై మూత పెట్టి హై ఫ్లేమ్‌పై 10 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు లేదా 9 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో మ‌ట‌న్ మెత్త‌గా ఉడుకుతుంది. మ‌ట‌న్ ఉడ‌క‌లేదంటే మ‌రి కాసిన్ని నీళ్ల‌ను పోసి మ‌ళ్లీ ఉడికించాలి. మ‌ట‌న్ ఉడికిన త‌రువాత మూత తీసి అందులో నిమ్మ‌ర‌సం పిండాలి. అనంత‌రం కొత్తిమీర‌, అవ‌స‌రం అయితే మ‌రి కాసిన్ని నీళ్ల‌ను పోయాలి. అయితే రుచి కోసం ఇందులో నెయ్యిని క‌లుపుకోవ‌చ్చు. ఇలా క‌లిపిన త‌రువాత వేడి వేడిగా స‌ర్వ్ చేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన మ‌ట‌న్ సూప్ రెడీ అవుతుంది. దీన్ని ఉదయం, మ‌ధ్యాహ్నం లేదా రాత్రి ఎప్పుడైనా స‌రే తీసుకోవ‌చ్చు. వేడిగా ఉన్న‌ప్పుడు తింటేనే రుచిగా ఉంటుంది. ఇలా మ‌ట‌న్ సూప్‌ను చేసి చ‌లికాలంలో తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌క్తి అందుతుంది. ఉల్లాసంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు.

Editor

Recent Posts