Naphthalene Balls : ఇవి ఎంత శ‌క్తివంత‌మైన‌వో తెలుసా..? ఇంత వరకు ఎవ్వరూ చెప్పని చిట్కా..!

Naphthalene Balls : నాఫ్త‌లీన్ బాల్స్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటినే డాంబ‌ర్ గోళీలు అని వాడుక భాష‌లో పిలుస్తూ ఉంటారు. ఘాటైన వాస‌న‌తో చూడ‌డానికి తెల్ల‌గా ఉండే ఈ నాఫ్తలీన్ బాల్స్ దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటాయి. ఎక్కువ‌గా బ‌ట్ట‌ల‌ను కీట‌కాలు నాశ‌నం చేయ‌కుండా ఉండ‌డానికి వీటిని వాడుతూ ఉంటారు. అలాగే సింక్ ద‌గ్గ‌ర చెడు వాస‌న రాకుండా ఉండ‌డానికి వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ నాఫ్తీల‌న్ బాల్స్ తో క్లీనింగ్ లిక్విడ్ ను త‌యారు చేసుకుని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఈ లిక్విడ్ రూమ్ ఫ్రెష్ న‌ర్ గా కూడా ప‌ని చేస్తుంది. నాఫ్తీల‌న్ బాల్స్ తో లిక్విడ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీని కోసం ముందుగా ఒక 6 లేదా 7 నాఫ్తలీన్ బాల్స్ ను తీసుకుని వాటిని మెత్త‌ని పొడిగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఒక మూత డెటాల్ ను వేసుకోవాలి. త‌రువాత ఇందులో 2 టీ స్పూన్ల వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో పావు క‌ప్పు వెనిగ‌ర్ ను వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల లిక్విడ్ త‌యార‌వుతుంది. ఈ లిక్విడ్ ను ప్లాస్టిక్ బాటిల్ లో వేసి నిల్వ చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న లిక్విడ్ ను నీటిలో వేసి ఇళ్లు శుభ్రం చేసుకోవ‌చ్చు. అలాగే టాయిలెట్ ల‌ను కూడా శుభ్రం చేసుకోవ‌చ్చు. ఇలా నాఫ్తలీన్ బాల్స్ తో త‌యారు చేసుకున్న లిక్విడ్ తో ఇంటిని శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే క్రిములు న‌శించ‌డంతో పాటు ఇళ్లు కూడా చాలా శుభ్ర‌ప‌డుతుంది.

Naphthalene Balls uses in telugu clean your house
Naphthalene Balls

టైల్స్ చాలా తెల్ల‌గా వ‌స్తాయి. ఇంట్లో చ‌క్క‌టి వాస‌న వ‌స్తుంది. అలాగే బొద్దింక‌లు కూడా రాకుండా ఉంటాయి. చెడు వాస‌న రాకుండా ఉంటుంది. అలాగే ఈ లిక్విడ్ లో దూదిని ముంచి స్ట‌వ్ ను, సింక్ ను కూడా శుభ్రం చేసుకోవ‌చ్చు. బ‌య‌ట లిక్విడ్స్ ను కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ విధంగా నాఫ్త‌లీన్ బాల్స్ తో లిక్విడ్ ను త‌యారు చేసుకుని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts