Peanut Rice : మనం అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. అన్నంతో చేసే ఈ వెరైటీలు చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నంతో చేసుకోదగిన రైస్ వెరైటీలల్లో పల్లీల రైస్ కూడా ఒకటి. పల్లీల పొడి వేసి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా పల్లీల రైస్ ను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పల్లీల రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీల రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – పావు కప్పు, ఎండుమిర్చి – 6, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, నువ్వులు – పావు కప్పు, నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, అన్నం – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత.
పల్లీల రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చికొబ్బరి ముక్కలు, నువ్వులు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అన్నం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసికలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల ఎంతో రుచిగా ఉండే పల్లీల రైస్ తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పల్లీలతో రైస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.