Nithya Menen : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అన్ని చోట్లా కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తోంది. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన నటించిన నిత్య మీనన్‌కు మాత్రం సినిమా పరంగా అన్యాయం జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలోనే పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

భీమ్లానాయక్ సినిమాలో పవన్ పక్కన నిత్య మీనన్ నటించగా.. రానా పక్కన సంయుక్త మీనన్ నటించింది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంయుక్త మీనన్ వచ్చింది కానీ అసలు హీరోయిన్ నిత్య మీనన్ రాలేదు. ఆమె బిజీగా ఉండో.. లేదా ఇతర కారణాల వల్లో.. రాలేదనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా విషయంలో కోపంగా ఉందని తెలుస్తోంది. అందుకనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదని అంటున్నారు.
ఈ సినిమాలో నిత్య మీనన్ పాత్రని హైలైట్ చేస్తానని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారట. కానీ అలా జరగలేదు. పైగా అంత ఇష్టం అనే సాంగ్ కూడా లేదు. దీంతో ఈ పరిణామాల వల్ల మనస్థాపం చెందిన నిత్య మీనన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకనే నిత్య మీనన్ గురించి చిత్ర యూనిట్ ఎక్కడా ప్రస్తావించలేదని.. ఇక నిత్య మీనన్ కూడా తన పోస్టుల్లో ఈ విషయాన్ని చెప్పలేదని.. అంటున్నారు. దీని వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిత్యమీనన్‌కు ఈ సినిమా విషయంలో అన్యాయం జరిగిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.