iPhone : అమెరికాలో చాలా వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఐఫోన్‌ను 10 ఏళ్ల కిందట పోగొట్టుకుంది. కానీ అది ఇటీవలే ఆమెకు చాలా చిత్రమైన పరిస్థితిలో దొరికింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని మేరీల్యాండ్ అనే ప్రాంతంలో నివాసం ఉండే బెక్కీ బెక్‌మన్ అనే మహిళకు చెందిన ఐఫోన్ 10 ఏళ్ల కిందట.. అంటే.. 2012లో పోయింది. అసలు ఆ ఫోన్ ఎలా పోయిందో ఆమెకు తెలియదు. బయటకు కూడా ఎక్కడికీ వెళ్లలేదు. దీంతో ఫోన్ ఎలా పోయింది అన్న విషయం ఆమెకు తెలియదు. ఈ క్రమంలోనే ఆమె ఆ ఫోన్‌పై ఆశలు వదిలేసుకుని వేరే ఫోన్‌ను కొని వాడడం ప్రారంభించింది.
అయితే ఇటీవలే వారి టాయిలెట్ పైప్స్ నుంచి వింతైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ శబ్దాలను విన్న బెక్కీ భర్త సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించే ప్రయత్నం చేశాడు. టాయిలెట్‌కు చెందిన డ్రైనేజీ పైపుల్లో ఆ శబ్దం వస్తుందని తెలుసుకుని అన్నింటినీ నిశితంగా పరిశీలించాడు. దీంతో ఓ పైపులో చిక్కుకుపోయిన ఐఫోన్ కనిపించింది. అది 10 ఏళ్ల కిందట బెక్కీ పోగొట్టుకునే ఐఫోనే. దాని వెనుక భాగం మొత్తం పగిలిపోయి ఉంది.
అయితే అసలు ఆ ఫోన్ టాయిలెట్‌లో ఎలా పడిందో కూడా ఆమెకు తెలియదు. కానీ 10 ఏళ్ల తరువాత ఆ ఐఫోన్ కనిపించే సరికి ఆమె షాకైంది. ఇక ఆ ఐఫోన్‌కు చెందిన ఫొటోలను వారు షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.