Noodles Pakoda : నూడుల్స్ ప‌కోడాల‌ను ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలా చేయాలంటే..?

Noodles Pakoda : మ‌నం ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు చేసుకోద‌గిన వాటిల్లో నూడుల్స్ కూడా ఒక‌టి. నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్ద‌లు వీటిని ఇష్టంగా తింటారు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా నూడుల్స్ ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేస్తూ ఉంటారు. ఈ నూడుల్స్ తో త‌రుచూ చేసే వాటితో పాటు మ‌నం ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నూడుల్స్ తో చేసే ఈ ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ ప‌కోడాలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స్వీట్ షాపుల్లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ఇవి ల‌భిస్తూ ఉంటాయి. నూడుల్స్ తో క్రిస్పీగా, రుచిగా ప‌కోడాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నూడుల్స్ ప‌కోడా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – అర లీట‌ర్, ఇన్ స్టాంట్ నూడుల్స్ – 2ప్యాకెట్స్( చిన్న‌వి), క్యాబేజి తతురుము – 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, నూడుల్స్ తో పాటు వ‌చ్చే మ‌సాలా పొడి – 2 ప్యాకెట్స్, శ‌న‌గ‌పిండి – 3 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Noodles Pakoda very tasty snacks to make
Noodles Pakoda

నూడుల్స్ ప‌కోడా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక నూడుల్స్ వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా వ‌డ‌క‌ట్టి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత గిన్నెలో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత నూడుల్స్ వేసి క‌ల‌పాలి. నీళ్లు వేయ‌కుండా వీటిని అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. త‌రువాత నూడుల్స్ మిశ్ర‌మాన్ని తీసుకుంటూ నిమ్మ‌కాయంత ప‌రిమాణంలో ఉండలుగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నూడుల్స్ ప‌కోడా త‌యార‌వుతుంది. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా నూడుల్స్ తో వేడివేడిగా ప‌కోడాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts