Nuvvulu Pallila Laddu : నువ్వులు, ప‌ల్లీలు క‌లిపి ఇలా ల‌డ్డూలు చేసి తినండి.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Nuvvulu Pallila Laddu : రోజూ ఒక ల‌డ్డూను తింటే చాలు ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. ఎముక‌ల‌కు త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంది. ఎముకల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. పిల్ల‌లకు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. ఈ ల‌డ్డూలను తీసుకోవ‌డం వ్ల‌ల క్యాల్షియం లోపం త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎముకల‌ను ధృడంగా చేసి, క్యాల్షియం లోపాన్ని త‌గ్గించి, ఆరోగ్యానికి మేలు చేసే ఈ ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల ప‌ల్లి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నువ్వులు – ఒక క‌ప్పు, ప‌ల్లీలు – ఒక క‌ప్పు, నీళ్లు – అర క‌ప్పు, బెల్లం తురుము – ఒక క‌ప్పు.

Nuvvulu Pallila Laddu recipe in telugu make in this method
Nuvvulu Pallila Laddu

నువ్వుల ప‌ల్లి ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నువ్వులు వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా క‌లుపుతూ వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీల‌ను కూడా మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నీళ్లు, బెల్లం తురుము వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై బెల్లం క‌రిగి తీగ పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. బెల్లం తీగ పాకం రాగానే మంట‌ను చిన్న‌గా చేసి వేయించిన ప‌ల్లీలు, నువ్వులు వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చల్లారిన త‌రువాత చేతుల‌కు నెయ్యి రాసుకుంటూ త‌గినంత మిశ్ర‌మాన్ని తీసుకుని ల‌డ్డూలాగా చుట్టుకోవాలి. ఈ మిశ్ర‌మం మ‌రీ గట్టిగా అయితే స్ట‌వ్ మీద ఉంచి కొద్దిగా వేడి చేసి మ‌ర‌లా ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల ప‌ల్లి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts