Onion Chicken Masala : ఆనియన్ చికెన్.. కర్ణాటక స్పెషల్ అయిన ఈ ఆనియన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయలతో చేసే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా ఉల్లిపాయలతో చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీకెండ్స్ లో ఇలా ఆనియన్ చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ ను ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియన్ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – రెండు రెమ్మలు, సాంబార్ ఉల్లిపాయలు – 10 నుండి 12, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం – 1, కారం – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అరకిలో, నీళ్లు – పావు లీటర్, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా.
ఆనియన్ చికెన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంటపై చికెన్ ను ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకం చికెన్ వెరైటీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.