Pappu Charu : ప‌ప్పు చారును ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!

Pappu Charu : మ‌నం వంటింట్లో కూర‌ల‌తోపాటు ప‌ప్పు చారును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పుచారు ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. కొంద‌రికి ప్ర‌తిరోజూ భోజ‌నంలో ప‌ప్పుచారు ఉండాల్సిందే. ఉద‌యం చేసుకునే అల్పాహారాల‌ను తిన‌డానికి మ‌నం ప‌ప్పుచారు త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ప‌ప్పుచారును ఎలా త‌యారు చేసుకోవాలో అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికి కొంద‌రు ఈ ప‌ప్పుచారును రుచిగా త‌యారు చేసుకోలేక పోతుంటారు. రుచిగా ప‌ప్పుచారును ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ప్పు చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – ఆరున్న‌ర‌ క‌ప్పులు, పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, పెద్ద‌గా త‌రిగిన ట‌మాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టీ స్పూన్, చిక్క‌గా ఉన్న చింత‌పండు గుజ్జు – ఒక క‌ప్పు, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్ లేదా త‌గినంత‌.

Pappu Charu make in this way for perfect taste
Pappu Charu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, ఇంగువ – చిటికెడు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ప‌ప్పు చారు త‌యారు విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పును వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత రెండున్న‌ర క‌ప్పుల నీళ్లు, త‌రిగిన ప‌చ్చి మిర్చి, త‌రిగిన ట‌మాట, ప‌సుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, నూనె వేసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన త‌రువాత మూత తీసి గంటెతో లేదా ప‌ప్పు గుత్తితో ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత రుచికి త‌గినంత మ‌రికొద్దిగా ఉప్పు, కారం, చింత‌పండు గుజ్జు, నీళ్లు పోసి క‌లుపుకోవాలి.

త‌రువాత ఒక ప‌ప్పు చారుకు స‌రిప‌డే గిన్నెను తీసుకుని అందులో నూనె పోసి నూనె కాగిన త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, ఆవాల‌ను, జీల‌క‌ర్ర‌ను, మిన‌ప ప‌ప్పును, ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకును, ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ఇంగువ‌ను కూడా వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసిపెట్టుకున్న ప‌ప్పుచారును పోసి బాగా క‌ల‌పాలి. ఈ ప‌ప్పు చారును చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు మ‌రిగించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు చారు త‌యార‌వుతుంది. ఈ ప‌ప్పుచారును అన్నం, ఇడ్లీ, పొంగ‌ల్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts