Pasta Kurkure : మనం పాస్తాతో వెజ్ పాస్తా, మసాలా పాస్తా వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ పాస్తా వంటకాలు చాలా చక్కగా ఉంటాయి. ఈ పాస్తాతో మనం తరుచూ చేసే వంటకాలతో పాటు కుర్ కురేను కూడా తయారు చేసుకోవచ్చు. పాస్తాతో చేసే ఈ కుర్ కురే చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్ కురే నిల్వ కూడా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. మ్యాక్రోని పాస్తాతో పాస్తా కుర్ కురేను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాస్తా కుర్ కురే తయారీకి కావల్సిన పదార్థాలు..
మ్యాక్రోని పాస్తా – 2 కప్పులు, నీళ్లు – 4 కప్పులు, ఉప్పు – ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్.
పాస్తా కుర్ కురే తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి నీటిని వేడి చేయాలి. నూనె వేడయ్యాక పాస్తాను వేసి 70 నుండి 80 శాతం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాస్తాను స్ట్రైనర్ లో వేసి నీరంతా పోయేలా వడకట్టాలి. తరువాత ఈ పాస్తాపై కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి వేసి టాస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. లేదంటే స్పూన్ తో పిండి పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పాస్తాను వేసి వేయించాలి. వీటిని నూనెలో వేసిన తరువాత ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఆ తరువాత కదుపుతూ వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించిన తరువాత వాటిపై ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి టాస్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాస్తా కుర్ కురే తయారవుతుంది. ఈ కుర్ కురేను అందరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.