ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక, వైసీపీ పార్టీ అష్ట కష్టాలు పడుతోంది. పార్టీ నడపడమే కష్టంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి. నాలుగు పార్లమెంట్ స్థానాలని గెలుచుకోవడంతో డీలా పడిపోయింది. చాలా మంది ఫైర్ బ్రాండ్ నేతలందరూ కూడా ఓడిపోయారు. గెలిచిన వాళ్ళలో పెద్దగా మాట్లాడే వాళ్లే లేరు. వైయస్ జగన్మోహన్ రెడ్డి దీంతో సతమతమవుతున్నారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని, కిలారి రోశయ్య తదితరు నేతలందరూ వైసీపీకి రాజీనామా చేసేసి జనసేనకి వెళ్లిపోయారు. అలాగే ఆర్ కృష్ణయ్య, మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ తదితరులు కూడా వైసీపీకి రాజీనామా చేసేసారు.
చాలా మంది వైసీపీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. షర్మిల ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ లేదా బీజేపీ, టీడీపీలో చేరకుండా జనసేన వైపు వెళ్తున్నారు. భవిష్యత్తులో వైసీపీ వర్సెస్ జనసేన ఫైట్ కొనసాగే అవకాశం ఉందని అంతా అంటున్నారు. అందుకే జనసేనలోకి వెళ్తే భవిష్యత్తు బాగుంటుందని నేతలందరూ కూడా అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై బాబు సీరియస్ గా ఉన్నారట. ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకు వెళ్లాలని చూస్తున్నారట. జనసేన బలపడితే టీడీపీ కి రానున్న రోజుల్లో కష్టమే.