One Rupee : మనలో చాలా మంది అప్పులతో, ఆర్థిక సమస్యలతో బాధపడతూ ఉంటారు. ఈ సమస్యలన్నీ తగ్గి ధనవంతులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాగే లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందడానికి కూడా మనం ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఒక రూపాయితో ఇలా పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందడానికి రూపాయితో పరిహారం ఎలా చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక శుక్రవారం నాడు ఒక ఎర్రని వస్త్రాన్ని, 21 రూపాయి బిళ్లలను తీసుకుని ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీ దేవికి పూజ చేసి హారతి ఇవ్వాలి. పూజ అనంతరం రూపాయి బిళ్లలన్నింటినీ ఎర్రని వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూటను ఒక గాజు సీసాలో ఉప్పు వేసి అందులో ఉంచాలి. ఆ మూటను రోజంతా అలాగే దైవ సన్నిధిలో ఉంచాలి. మరుసటి రోజు అనగా శనివారం నాడు ఆ మూటను ఇంట్లో ధనం భద్రపరుచుకునే చోట ఉంచాలి. ఈ విధంగా ఆరు శుక్రవారాల పాటు చేసిన తరువాత వచ్చిన ఆ ఆరు మూటలను తీసుకుని లక్ష్మీ దేవి గుడిలో ఉండే హుండీలో వేయాలి. ఈ విధంగా ఆరు వారాల పాటు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా పుంజుకుంటారు. ఆర్థికంగా పుంజుకున్న తరువాత ఒక ఆరు నెలల పాటు ఇదే విధంగా పూజ చేసి వచ్చిన మూటలన్నింటనీ లక్ష్మీదేవి ఆలయంలో హుండీలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో ధనం నిలుస్తుంది.
అదే విధంగా ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ దేవి అష్టోత్తర శతనామాన్ని చదువుతూ 108 రూపాయి బిళ్లలతో లక్ష్మీ దేవి కి పూజ చేస్తే చాలా మంచిది. ఈ రూపాయి బిళ్లలన్నింటినీ ఎర్రని వస్త్రంలో ఉంచి మూట కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ధన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ఈ నియమాలను పాటించాలి. ఒక నల్లని వస్త్రాన్ని తీసుకుని అందులో 5 ఆవాలను, 5 లవంగాలను, 5 యాలకులను, ఒక తోలు బెల్టు మక్క, ఒక చిన్న మేకు, సింధూరం వేసి మూటకట్టి సింహద్వారం వద్ద కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. నర దిష్టి, నర ఘోష వంటివి ఏ ఇంట్లో అయితే ఉండవో ఆ ఇంట్లో ధనం నిలుస్తుంది.
అదేవిధంగా మనకు ఎంతటి దగ్గరివారైనా సరే వారికి వెండి వస్తువులను కానుకగా ఇవ్వకూడదు. పాలు, పెరుగు, ఉప్పు, చీపురు, నూనె, కత్తెర, కత్తి, కట్టె పుల్లల వంటి వాటిని ఇతరులకు అరువుగా ఇవ్వకూడదు. మనం ఎప్పుడూ కూడా చిరిగిన బట్టలను ధరించకూడదు. అలాగే ఒక శుక్రవారం నాడు ఆవు పాలలో తేనెను కలిపి రావి ఆకుతో ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం వల్ల దోషాలన్నీ తొలగి ఇంట్లో ధనం నిలుస్తుంది. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ దేవి ముందు, తులసి మాత ముందు నెయ్యితో దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో శనీశ్వరునికి పూజ చేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ నియమాలను పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ దేవి కటాక్షాన్ని మనం పొందడమే కాకుండా లక్ష్మీ దేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది.