Pressure Cooker Cake : ఇంట్లో ఉండే కుక్కర్‌తోనే ఎంతో రుచిగా బేక‌రీ స్టైల్ కేక్‌ను చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Pressure Cooker Cake : చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే వాటిల్లో కేక్ ఒక‌టి. ఇది మ‌న‌కు బేక‌రీల్లో ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతుంది. కేవ‌లం బ‌ర్త్ డే ల‌కు కాకుండా ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి శుభ‌కార్యానికి కూడా కేక్ ను క‌ట్ చేస్తున్నారు. బేక‌రీల్లో ల‌భించే విధంగా ఉండే ఈ స్పాంజ్ కేక్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కేక్ ను త‌యారు చేసుకోవ‌డానికి ఓవెన్ త‌ప్ప‌కుండా ఉండాల‌ని చాలా మంది భావిస్తారు. అయితే ఓవెన్ లేక‌పోయినా కూడా మ‌నం కేక్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఇంట్లో ఉండే కుక్క‌ర్ ను ఉప‌యోగించి చాలా రుచిగా చ‌క్క‌గా ఉండే కేక్ ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. కుక్క‌ర్ లో కేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా.. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా కుక్క‌ర్ లోనే కేక్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. కుక్క‌ర్ లో చాలా సుల‌భంగా స్పాంజ్ కేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పాంజ్ కేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 3, పంచ‌దార – 150 గ్రా., మైదా పిండి – 150 గ్రా., బేకింగ్ పౌడ‌ర్ – అర టేబుల్ స్పూన్, క‌రిగించిన బ‌ట‌ర్ – పావు క‌ప్పు, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్.

Pressure Cooker Cake recipe in telugu make in bakery style
Pressure Cooker Cake

స్పాంజ్ కేక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో పంచ‌దార‌ను వేసి బ్లెండ‌ర్ తో బాగా క‌లుపుకోవాలి. బ్లెండ‌ర్ అందుబాటులో లేని వారు విస్క‌ర్ తో 5 నిమిషాల పాటు బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో జ‌ల్లెడ‌ను ఉంచి అందులో మైదా పిండి, బేకింగ్ పౌడ‌ర్ వేసి జ‌ల్లించుకోవాలి. ఇలా జ‌ల్లించుకున్న పిండిని ముందుగా త‌యారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్ర‌మంలో వేసి అంతా క‌లిసేలా ఒకే దిశ‌లో క‌లుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బ‌ట‌ర్, వెనీలా ఎసెన్స్ వేసి మ‌ర‌లా ఒకే దిశ‌లో క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నెను తీసుకుని దానికి నెయ్యిని రాసుకోవాలి.

త‌రువాత రెండు టీ స్పూన్ల మైదాపిండిని తీసుకుని గిన్నెలో చ‌ల్లుకుని ముందుగా త‌యారు చేసుకున్న కేక్ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి. త‌రువాత ఇందులో గాలి బుడ‌గ‌లు లేకుండా గిన్నెను క‌దుపుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క‌ర్ లో ఐర‌న్ స్టాండ్ ను ఉంచి కుక్క‌ర్ పై విజిల్ లేకుండా మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. ఐర‌న్ స్టాండ్ అందుబాటులో లేని వారు ఇందులో ఉప్పును లేదా ఇసుక‌ను వేసుకోవాలి. ఇలా వేడి చేసిన త‌రువాత ఇందులో కేక్ గిన్నెను ఉంచి కుక్క‌ర్ పై విజిల్ లేకుండా మూత పెట్టాలి. దీనిని 30 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత టూత్ పిక్ ను కేక్ లో గుచ్చి చూడాలి. టూత్ పిక్ కు ఏమి అంటుకోకుండా ఉంటేకేక్ ఉడికిన‌ట్టుగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

లేదంటే మ‌రికొద్ది సేపు కేక్ ను ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కేక్ పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. కేక్ చ‌ల్లారిన త‌రువాత గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకుని కావల్సిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బేక‌రీల్లో ల‌భించే విధంగా ఉండే స్పాంజ్ కేక్ ను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో ఓవెన్ లేకున్నా ఇలా రుచిగా , చ‌క్క‌గా కేక్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts