Ashoka Tree Root : ప్రస్తుత కాలంలో ఏది కావాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా డబ్బు ఎంతో అవసరం అవుతోంది. డబ్బు లేనిదే ఏదీ మన దగ్గరికి రాదు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు చిన్న ఉద్యోగం అయినా సరే డబ్బు సంపాదించాలని చేస్తూ ఉంటారు. కొందరు డబ్బు మన వద్ద ఉండాలంటే ఆ లక్ష్మీ దేవి కటాక్షం మన పైన ఉండాలని పండితులను కలిసి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు తక్కువ సమయంలో కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అడ్డ దారులు కూడా తొక్కుతూ ఉంటారు.
ప్రపంచంలో సామాన్యుడు మొదలు కొని ధనవంతుల వరకు డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు వారి వారి ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేక డబ్బు సంపాదించలేకపోతుంటారు. ఇలా ఆర్థిక బాధలతో బాధపడుతున్న వారు ఆర్థిక సుస్థిరత కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమవుతన్న వారు మంగళ వారం నాడు ఈ పరిష్కారాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులను తొలగించే ఈ పరిష్కారం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళ వారం నాడు ఈ చిన్న పరిష్కారాన్ని చేయడం వల్ల మన ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. మంగళ వారం నాడు సూర్యోదయం కాక ముందే తలస్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రపరచాలి. ఇలా చేసిన తరువాత మన ఇంటి పెరట్లో ఉన్న లేదా ఇంటికి దగ్గర్లో ఉన్న అశోక చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టుకు నమస్కరించి మన కష్టాన్ని, మనం చేపట్టిన పనిని మనసులో అనుకుని ఆ చెట్టు వేరును సేకరించి దానిని పసుపు నీటితో శుభ్రపరిచి దానిని పూజ గదిలో లక్ష్మీ దేవి ముందు ఉంచి లక్ష్మీ దేవి అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ దేవి స్తోత్రాలను కానీ పఠించి ఆ వేరుకు ధూపం చూపించాలి. తరువాత ఆ వేరును డబ్బు ఉంచే చోట అనగా బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి. ఇలా డబ్బు ఉంచే చోట ఆ వేరును ఉంచడం వల్ల ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ధన నష్టం కలగదని, ధనం వృథాగా ఖర్చు అవదని వారు తెలియజేస్తున్నారు.