Rice Vada : మిగిలిపోయిన అన్నాన్ని పడేయ‌కండి.. దాంతో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Rice Vada : మ‌న ఇంట్లో ఒక్కొసారి అన్నం ఎక్కువ‌గా మిగులుతూ ఉంటుంది. అన్నం మిగిలిన‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా పులిహోర‌, ట‌మాట రైస్, జీరా రైస్ ఇలా ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఇలాంటి వంట‌కాలే కాకుండా మిగిలిన అన్నంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. మిగిలిన అన్నంతో రుచిగా, క్రిస్పీగా వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నం వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – ఒక పెద్ద క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ‌లు – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – 2 స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – అర‌క‌ట్ట‌.

Rice Vada recipe in telugu very tasty
Rice Vada

అన్నం వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అన్నాన్ని తీసుకుని మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత అన్నం తీసుకున్న క‌ప్పుతో స‌గం క‌ప్పు ర‌వ్వ‌ను వేసి క‌ల‌పాలి. దీనిని మెత్త‌గా క‌లుపుకున్న త‌రువాత మిగిలిన ప‌దార్థాలన్ని వేసి క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీళ్లు వేసి వ‌డ పిండి మాదిరి క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వ‌డ‌ల మాదిరి వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అన్నం వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని అల్లం చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts