RRR Movie : మళ్లీ వివాదంలో చిక్కుకున్న ఆర్ఆర్ఆర్.. ఈ సారి ఏమైందంటే..?

RRR Movie : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై మొద‌టి నుంచి వివాదాలు వ‌స్తూనే ఉంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మ‌రో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల పేర్ల‌ను మార్చి సినిమాను విడుద‌ల చేయాల‌ని కోరుతున్నారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి రాజ‌మౌళి ఇలా సినిమా తీయ‌డం స‌మంజ‌సం కాద‌ని అంటున్నారు.

RRR Movie yet again in controversy now this has happened
RRR Movie

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు మేనల్లుడు గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్‌ల‌కు చెందిన చ‌రిత్ర‌ల‌ను వ‌క్రీక‌రించి ఈ సినిమాను తీశార‌ని.. గాంధీ ఆయుధాలు చేత‌ప‌ట్టిన‌ట్లు.. ఆయ‌న నేతాజీతో క‌లిసి పోరాటం చేసిన‌ట్లు.. సినిమా తీయ‌గ‌ల‌రా ? అని ప్ర‌శ్నించారు. డ‌బ్బు కోసం మ‌హానీయుల చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తారా ? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ సినిమాపై తాము న్యాయ పోరాటం చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఇందులో అల్లూరి, కొమురం భీమ్‌ల పేర్ల‌ను మార్చి సినిమాను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాపై గ‌తంలోనూ ఇలాంటి వివాదాలే వ‌చ్చాయి. అల్లూరి 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో జ‌న్మినంచ‌గా.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారుజామున‌ కాల్పుల్లో వీరమరణం పొందారు.

ఇక‌ కొమురం భీమ్ 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఇద్దరికీ పరిచయం ఉన్నట్లు కానీ.. స్నేహం ఉన్నట్లు కానీ.. చరిత్రలో ఎక్కడా లేదని.. అసలు చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సరైన పద్ధతి కాద‌ని.. అల్లూరి అభిమానులు అంటున్నారు. ఇక ఈ వివాదంపై ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందించాల్సి ఉంది.

Share
Editor

Recent Posts