Sajja Ganji : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన గంజి.. పాత ప‌ద్ధ‌తిలో ఇలా చేయండి..!

Sajja Ganji : వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు, అలాగే రెస్టారెంట్ ల‌కు వెళ్లిన‌ప్పుడు చాలా మంది సూప్ ల‌ను తాగుతూ ఉంటారు. సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా సూప్ ను తాగితే చాలాహాయిగా ఉంటుంది. అయితే సూప్ లు త‌యారు చేయ‌డానికి కార్న్ ఫ్లోర్ ను, మైదాపిండిని, ఫుడ్ క‌లర్స్ ను వాడుతూ ఉంటారు. వీటితో త‌యారు చేసిన సూప్ ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వీటికి బ‌దులుగా చిరుధాన్యాలైన స‌జ్జ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే సూప్ ను త‌యారు చేసుకోవ‌చ్చు.

స‌జ్జ‌ల‌తో చేసే సూప్ రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేట‌ప్పుడు ఇలా స‌జ్జ‌ల‌తో సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో పాటు శ‌రీరానికి కూడా బ‌లం క‌లుగుతుంది. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ సజ్జ సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Sajja Ganji recipe in telugu very healthy how to make it
Sajja Ganji

స‌జ్జ‌ గంజి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌జ్జ‌లు – ఒక క‌ప్పు, నీళ్లు – 5 క‌ప్పులు, నూనె – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క్యారెట్ ముక్క‌లు – ఒక క‌ప్పు, ఉడికించిన బ‌ఠాణీలు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

స‌జ్జ‌ గంజి త‌యారీ విధానం..

ముందుగా స‌జ్జ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి 4గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత మ‌ట్టిపాత్ర‌లో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టిన స‌జ్జ‌లు వేసి ఉడికించాలి. స‌జ్జ‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత గంజిని వార్చి గిన్నెలోకి తీసుకోవాలి. ఉడికిన సజ్జ అన్నాన్ని ఆవిరి పోయే వ‌ర‌కు ఉడికించి అన్నాన్ని తీసుకున్న మాదిరి తీసుకోవాలి. ఇప్పుడు వార్చిన గంజితో సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం మ‌రో మ‌ట్టి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి.

త‌రువాత అల్లం త‌రుగు, ప‌చ్చిమిర్చి, క్యారెట్ ముక్క‌లు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వార్చిన గంజిని వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, బ‌ఠాణీలు, మిరియాల పొడి వేసి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌జ్జ గంజి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా స‌జ్జ‌ల‌తో సూప్ ను త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మనం రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts