Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. విడాకుల డిప్రెషన్ నుంచి బయట పడేందుకు టూర్లు కూడా వేస్తోంది. మరోవైపు వరుస సినిమాలతోనూ బిజీగా ఉంటోంది. అయితే సమంత తాజాగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
సమంత తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. వారు ఏమనుకుంటున్నారు ? వీరు ఏం నమ్ముతున్నారు ? అని ఆలోచించాల్సిన పనిలేదు స్నేహితులారా ! ఇతరుల అభిప్రాయాలు, వారి ప్రశంసలు మనకవసరం లేదు. మీరు స్వేచ్ఛగా ఉంటే .. వారు మిమ్మల్ని ఎప్పటికీ ఏమీ చేయలేరు.. అని అర్థం వచ్చేట్లు సమంత పోస్ట్ పెట్టింది.
అయితే సమంత పెట్టిన పోస్టు పరోక్షంగా నాగార్జున, నాగచైతన్యలను టార్గెట్ చేసే విధంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అంటే అక్కినేని ఫ్యామిలీతో ఉన్నప్పుడు సమంత అభిప్రాయాలను వారు గౌరవించలేదని మనకు స్పష్టమవుతోంది. అందుకనే సమంత.. చైతన్యకు విడాకులు ఇచ్చిందని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.
అయితే విడాకుల ప్రకటన అనంతరం సమంత మరింత గ్లామర్ షో చేస్తుండడం విశేషం. ఈమె సోషల్ మీడియాలో పెడుతున్న ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. వాస్తవానికి గతంలో ఎప్పుడో ఒకసారి ఈమె గ్లామర్ షో చేసేది. అయితే ఇప్పుడు మాత్రం తరచూ అలాంటి ఫొటోలనే షేర్ చేస్తోంది.
ఇటీవలే న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళ్లిన సమంత తన స్నేహితురాలు, మోడల్ శిల్పా రెడ్డితో కలిసి గోవా బీచ్‌లో బికినీలతో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత తాజాగా పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ లో మెప్పించింది. అలాగే త్వరలో ఈమె నటించిన కాతువాకుల రెండు కాద్ అనే తమిళ మూవీ విడుదల కానుంది. శాకుంతలం అనే తెలుగు మూవీలోనూ ఈమె నటించింది. ఇవి కాకుండా ఒక బాలీవుడ్ మూవీ చేయనుంది. ఇంకో హాలీవుడ్ మూవీలో నటించేందుకు కూడా సమంత ఇటీవలే గ్రీన్ సిగ్నల్ వచ్చింది.