Sarva Pindi : తెలంగాణ స్పెష‌ల్ వంట‌కం.. స‌ర్వ‌పిండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Sarva Pindi : తెలంగాణ‌ సాంప్ర‌దాయ వంట‌కాల్లో స‌ర్వ‌పిండి కూడా ఒక‌టి. స‌ర్వ‌పిండి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లసిన ప‌ని లేదు. క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉండే ఈ స‌ర్వ‌పిండిని స్నాక్స్ గా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. కొద్దిగా ఓపిక ఉండాలే కానీ స‌ర్వ‌పిండిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా సుల‌భంగా స‌ర్వ‌పిండిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స‌ర్వ‌పిండి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – రెండు క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, ప‌చ్చిమిర్చి – 6 లేదా 8, జీల‌క‌ర్ర – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, వేయించి పొట్టు తీసిన ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌పప్పు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్.

Sarva Pindi Telangana special dish recipe is here
Sarva Pindi

స‌ర్వ‌పిండి త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ప‌చ్చిమిర్చిని, జీల‌క‌ర్ర‌ను వేసి క‌చ్చా ప‌చ్చ‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. ఇందులో క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి మిశ్ర‌మంతోపాటు మిగిలిన ప‌దార్థాల‌న్నింటినీ వేయాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా ఉండే రెండు క‌ళాయిల‌ను తీసుకోవాలి. ముందుగా ఒక క‌ళాయిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయాలి. త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని క‌ళాయిలో ఉంచి చేత్తో స‌ర్వ‌పిండిలా వ‌త్తుకోవాలి.

త‌రువాత వేళ్ల‌తో స‌ర్వ‌పిండికి మ‌ధ్య మ‌ధ్య‌లో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇలా స‌ర్వ‌పిండిని వ‌త్తుకున్న క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి మూత పెట్టి చిన్న మంట‌పై స‌ర్వ‌పిండిని కాల్చుకోవాలి. ఇలా ఒక క‌ళాయిలో స‌ర్వ‌పిండి కాలుతూ ఉండ‌గా మ‌రో క‌ళాయిలో స‌ర్వ‌పిండిని వ‌త్తుకుని సిద్దం చేసుకుని పెట్టుకోవాలి. స‌ర్వ‌పిండి కాలి క‌ళాయి నుండి వేరు అవుతుండ‌గా దానిని తిప్పి మ‌రో వైపు కాల్చుకోవాలి. గుండ్ర‌టి క‌ళాయి లేని వారు పెనం మీద కూడా ఈ స‌ర్వపిండిని కాల్చుకోవ‌చ్చు.

ఈ విధంగా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే స‌ర్వ‌పిండి త‌యారవుతుంది. ఇలా తయారు చేసిన స‌ర్వ‌పిండి రెండు నుండి మూడు రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో బ‌య‌ట ల‌భించే చిరు తిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా స‌ర్వ‌పిండిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Share
D

Recent Posts