Semiya Kesari : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ వంటకాలను తయారు చేయడం కూడా చాలా సులభం. సేమియాతో ఎక్కువగా పాయసం, ఉప్మా, పులావ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సేమియాతో మనం ఎంతో రుచిగా ఉండే కేసరిని కూడా తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సేమియాతో రుచిగా కేసరిని ఎల తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు.
సేమియా కేసరి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో సేమియా వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. సేమియా వేగిన తరువాత రెండు కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు సేమియాను నీరంతా పోయే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. నీరంతా పోయిన తరువాత పంచదార, యాలకుల పోడి వేసి కలపాలి. పంచదార కరిగిన ఫుడ్ కలర్ వేసి కలపాలి.
తరువాత నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా కేసరి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా స్పెషల్ డేస్ లో ఇలా సేమియాతో తక్కువ సమయంలో రుచిగా కేసరిని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సేమియాతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కేసరిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.