తాజాగా నెట్టింట ఒక వీడియో వైరల్ గా మారింది. పాము కి సంబంధించిన ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూసారు. బెడ్ రూమ్ లో పాములు ఫైట్ కి సంబంధించిన ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక బెడ్ రూమ్లో మంచం కింద ఒకదానికొకటి చుట్టి పాములు బంధించబడ్డాయి.
వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి గది వెలుపల మంచం కింద పాములపై టార్చ్ వేసి చూస్తున్నాడు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ పోస్ట్ చేశారు. పాములని తర్వాత రక్షించి అడవిలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు పోస్ట్ చేశారు.
దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా రెండు పాములు ఒకదానికి ఒకటి పట్టుకుని ఉండడంతో కొంచెం ప్రైవసీ ఇవ్వాలని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఇంకో యూజర్ అవి రెండు ఏకాంతంలో గడుపుతున్నాయని కామెంట్ చేశారు. ఈ వీడియోకి ఇలా నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.