Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Spicy Boti Curry : బోటి కర్రీని ఇలా చేయండి.. అస‌లు స్మెల్ రాదు.. ఎంతో కారంగా టేస్టీగా ఉంటుంది..!

D by D
December 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Spicy Boti Curry : మాంసాహార ప్రియుల‌కు బోటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బోటితో కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. బోటి కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బోటి కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కూర‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రికి న‌చ్చేలా బోటికూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బోటి కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోటి – అర‌కిలో, ఎండకొబ్బ‌రి ముక్క – పావు ముక్క‌, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 15, యాల‌కులు – 3, ల‌వంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ఉల్లిపాయ ముక్కలు – ఒక క‌ప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 3 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని, కొత్తిమీర – కొద్దిగా.

Spicy Boti Curry recipe very tasty with rice how to make this
Spicy Boti Curry

బోటి కూర త‌యారీ విధానం..

ముందుగా నీటిలో ఉప్పు, ప‌సుపు, బోటి వేసి 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత బోటిని వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఎండుకొబ్బ‌రిని పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత బిర్యానీ ఆకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ పేస్ట్, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న అల్లం మిశ్ర‌మం వేసి వేయించాలి. త‌రువాత బోటి వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, కొబ్బ‌రి పొడి వేసి క‌లపాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 4 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర వేసి మూత పెట్టి 8 నుండి 9 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి అంతాక‌లిసేలా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే బోటి కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Spicy Boti Curry
Previous Post

Usirikaya Pulihora : ఉసిరికాయ‌ల‌తో ఎంతో క‌మ్మ‌నైన పులిహోర‌.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Next Post

Ragi Java And Oats : ఆరోగ్యంగా ఉండ‌డం కోసం రాగి జావ‌, ఓట్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.