Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో కార కారంగా ఉండే ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో మ‌నం ఎన్నో ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగ మున‌క్కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మున‌క్కాయ‌ల‌తో త‌రుచూ కూర‌లే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే ఊర‌గాయ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఊర‌గాయ 6 నెల‌ల‌కు పైగా నిల్వ ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఊర‌గాయ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చ‌ళ్లు చేయ‌డం రాని వారు కూడా చిటికెలో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మున‌క్కాయ మెంతి ఊర‌గాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌క్కాయ మెంతి ఊర‌గాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మెంతులు – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, ప‌ల్లీ నూనె -200 ఎమ్ ఎల్, మున‌క్కాయ‌లు – 4, కారం – 50గ్రా., ఉప్పు – 35గ్రా., చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, ప‌సుపు – అర టీ స్పూన్.

Spicy Drumstick Pickle recipe very tasty with rice and ghee
Spicy Drumstick Pickle

మున‌క్కాయ మెంతి ఊర‌గాయ త‌యారీ విధానం..

ముందుగా మున‌క్కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు, ఆవాలు వేసి దోర‌గా వేయించాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింత‌పండు కూడా వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మున‌క్కాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చ‌ల్లారిన త‌రువాత కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మెంతుల పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 4 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డిని గాజు సీసాలో వేసి 2 రోజుల పాటు ఊర‌బెట్టిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ మెంతి ఊర‌గాయ తయార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మున‌క్కాయ ఊర‌గాయ‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts