Sreesanth : వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్‌ను శ్రీశాంత్ తానే చేజేతులా నాశనం చేసుకున్నాడని చెప్పవచ్చు. లేదంటే స్టార్ పేస్ బౌలర్‌గా ఒక వెలుగు వెలిగి ఉండేవాడు. అయితే అది గతం. ఇప్పుడు అతను మళ్లీ క్రికెట్‌లోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. గత ఏడాది ఐపీఎల్ వేలం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఎవరూ అతన్ని కొనుగోలు చేయలేదు. ఇక ఈ సారి ఐపీఎల్ మెగా వేలం కోసం కూడా శ్రీశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. మరి ఈ సారైనా అతన్ని ఏదైనా టీమ్ కొనుగోలు చేస్తుందో, లేదో చూడాలి.

ఇక శ్రీశాంత్ క్రికెట్‌కు దూరం అయ్యాక పలు హిందీ, మళయాళం, కన్నడ సినిమాల్లో నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తమిళ ఇండస్ట్రీలో శ్రీశాంత్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలకపాత్రల్లో నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే మూవీలో శ్రీశాంత్ ఓ కీలకపాత్రలో నటించాడు.
ఇక ఈ మూవీకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. కాగా ఈ మూవీలో శ్రీశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా లాంచ్ చేశారు. నిన్న మొన్నటి వరకు అసలు శ్రీశాంత్ ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలియదు. కానీ శ్రీశాంత్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ మూవీలో శ్రీశాంత్ మహమ్మద్ నబీ రోల్‌లో నటించాడు. ఇక ఈ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కాతు వాకుల రెండు కాదల్ మూవీ టీజర్‌ను ఈ నెల 11వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.