Street Style Chicken Noodles : అచ్చం బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే లాగానే చికెన్ నూడుల్స్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Street Style Chicken Noodles : మ‌న‌కు సాయంత్రం స‌మయాల్లో ఫాస్ట్ ఫుడ్ బండ్ల మీద ల‌భించే వంట‌కాల్లో చికెన్ నూడుల్స్ కూడా ఒక‌టి. చికెన్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ తింటారు. వేడి వేడిగా ఈ చికెన్ నూడుల్స్ ను తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. ఈ చికెన్ నూడుల్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవచ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో స్ట్రీట్ స్టైల్ లో చికెన్ నూడుల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ నూడుల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – 200 గ్రా., కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్డు – 2, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నీళ్లు – ఒక‌టిన్న‌ర లీట‌ర్, నూడుల్స్ – ఒక‌టిన్న‌ర చుట్టూ, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, క్యారెట్ త‌రుగు – పావు క‌ప్పు, క్యాబేజ్ తురుము – అర క‌ప్పు, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, సోయా సాస్ – అర టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ -ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా -అర టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఆరోమాటిక్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

Street Style Chicken Noodles recipe in telugu make in this way
Street Style Chicken Noodles

చికెన్ నూడుల్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గ‌రం మ‌సాలా, పావు టీ ఉప్పు, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లపాలి. త‌రువాత ఇందులో చికెన్ ను వేసి క‌లపాలి. త‌రువాత కార్న్ ఫ్లోర్, మైదాపిండి వేసి క‌లపాలి. త‌రువాత స‌గం కోడిగుడ్డును, ఫుడ్ క‌ల‌ర్ ను వేసి బాగా కోట చేసుకోవాలి. దీనిని 30 నిమిషాల పాటు మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి.త‌రువాత గిన్నెలో లీట‌ర్న‌ర నీళ్లు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నూడుల్స్ వేసి 90 శాతం ఉడికించాలి. త‌రువాత వీటిని జ‌ల్లిగంటెలోకి తీసుకుని చ‌ల్ల‌టి నీళ్లు పోయాలి. వీటిని పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి బాగా వేడి చేయాలి.

క‌ళాయి వేడ‌య్యాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి క‌ళాయి అంతా చేసుకోవాలి. నూనె వేడైన‌ త‌రువాత రెండు కోడిగుడ్లు వేసి వేయించాలి. కోడిగుడ్లు వేగిన త‌రువాత ఇందులో క్యారెట్ ముక్క‌లు, క్యాబేజి తురుము, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత వేయించిన చికెన్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత నూడుల్స్ వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు టాస్ చేసిన త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి టాస్ చేసుకోవాలి. చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకుని మ‌రో అర నిమిషం పాటు టాస్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ నూడుల్స్ త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే రుచిగా చికెన్ నూడుల్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts