Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకి పరిచయాలు పెద్దగా అక్కర్లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారాడు. ఆయన లేని షో లేదంటే అతిశయోక్తి కాదు. ఈటీవీ ఈవెంట్స్ అన్నింటిలోనూ సుధీర్ తప్పక ఉంటాడు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత ఫేమస్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. అంతేకాదు.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.
కొన్ని సార్లు అయితే రష్మీ, సుధీర్‌కి ఏకంగా పెళ్లిళ్లు కూడా చేశారు. అయితే అదంతా ప్రోగ్రాంలో భాగం అని తెలిసి అభిమానులు నిరాశ చెందారు. సుధీర్ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించాడు. అలాగే హీరోగానూ మారి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘త్రీమంకీస్’ అనే సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు సుధీర్ హీరోగా ‘కాలింగ్ సహస్రా’, ‘గాలోడు’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ వేడుకను నిర్వహించారు. దానికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల, ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ ఛానెళ్లలో విడుదల చేశారు. ఓ అమ్మాయికి సుడిగాలి సుధీర్ రింగ్ తొడిగాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జి ఇంద్రజతో పాటు జబర్దస్త్ కమెడియన్ల మధ్య ఈ వేడుక వైభంగా జరిగింది. నటీనటులందరూ ఈ జంటను ఆశీర్వదించారు. ఇది రియల్ వేడుకా, లేక రీల్ వేడుకా అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాకపోవడంతో కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. ఈ ఆదివారం దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.