Thamalapaku Rasam : త‌మ‌ల‌పాకుల‌తోనూ ర‌సం చేయ‌వ‌చ్చు తెలుసా.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Thamalapaku Rasam : ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్ల‌లో త‌మ‌ల‌పాకు మొక్క కూడా ఒక‌టి. త‌మ‌ల‌పాకు ఆకులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన మొక్క‌ల‌ల్లో త‌మ‌ల‌పాకు మొక్క కూడా ఒక‌టి. త‌మ‌ల‌పాకుతో ఎక్కువ‌గా కిల్లీని త‌యారు చేస్తూ ఉంటారు. కొంద‌రు నేరుగా న‌ములుతూ ఉంటారు. వీటితో పాటు త‌మ‌ల‌పాకుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌మ‌ల‌పాకుతో చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, ఆక‌లి లేక‌పోవ‌డం, శ‌రీరంలో న‌ల‌త‌గా ఉన్న‌ప్పుడు ఇలా త‌మ‌ల‌పాకుతో ర‌సాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ ర‌సాన్ని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఈ త‌మ‌ల‌పాకు రసాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

త‌మ‌ల‌పాకు ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌మ‌ల‌పాకులు – 7 నుండి 8, నాటు ట‌మాటాలు – 3, త‌రిగిన కొత్తిమీర – గుప్పెడు, ఉప్పు – త‌గినంత‌, ర‌సం పొడి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 600 ఎమ్ ఎల్, ప‌సుపు – అర టీ స్పూన్, మిరియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు.

Thamalapaku Rasam recipe in telugu tasty with rice
Thamalapaku Rasam

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బ‌లు – 4.

త‌మ‌ల‌పాకు ర‌సం త‌యారీ విధానం..

ముందుగా జార్ లో త‌మ‌ల‌పాకుల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత ఇందులోనే ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 12 నుండి 15 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చక్క‌గా వేగిన త‌రువాత దీనిని ర‌సంలో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఈ ర‌సాన్ని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ ర‌సాన్నివేడి వేడిగా అన్నంతో తింటే చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

D

Recent Posts