Pooja Hegde : ముకుంద సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డె. తన అందంతో, నటనతో అభిమానులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస సినిమాలతో ఈ ముద్దు గుమ్మ చాలా బిజీగా ఉంది. రాధే శ్యామ్ సినిమా తరువాత విజయ్ దళపతితో బీస్ట్ సినిమాలో నటిస్తోంది. పూజా హెగ్డె నటించిన అల.. వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో బీస్ట్ సినిమాలో అరబిక్ కుతు సాంగ్‌కు అంతే క్రేజ్ వచ్చింది.

బాలీవుడ్‌లో కూడా పూజా హెగ్డె బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ భాయ్‌జాన్ తోపాటు రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కస్ సినిమాలో కూడా పూజా హీరోయిన్ గా నటిస్తోంది. వీటితోపాటు ఈ డస్కీ బ్యూటీ తెలుగులో ఆచార్యలో నటించింది. మహేశ్ బాబు మూవీలో త్వరలో నటించనుంది.
2022 లో పూజా హెగ్డె నటిస్తున్న ఐదు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల్లో తన క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని, ఐదు సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తాయని పూజా చాలా నమ్మకంగా ఉంది. రాధే శ్యామ్‌లో ప్రేరణ పాత్రతో తన నటనను నిరూపించుకుంది. ఆచార్య సినిమాలో పల్లెటూరి తెలుగు అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇలా వరుస సినిమాలతో తీరిక లేకుండా పూజా హెగ్డె చాలా బిజీగా ఉంది.