Android Phones : మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారా ? అయితే అందులో యూనిసోక్ ఎస్‌సీ9863ఎ అనే చిప్‌సెట్ ఉందా ? అయితే మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే. ఇలాంటి ఫోన్లు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటిల్లో తాజాగా సెక్యూరిటీ లోపం తలెత్తినట్లు నిర్దారించారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
యూనిసోక్ కంపెనీకి చెందిన చిప్ సెట్‌లను ప్రస్తుతం అనేక ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కంపెనీ తయారు చేసిన యూనిసోక్ ఎస్‌సీ9863ఎ అనే ప్రాసెసర్ చాలా ఫోన్లలో ఉంది. అయితే ఈ చిప్‌సెట్‌లో తాజాగా సెక్యూరిటీ, ప్రైవసీ లోపాలు వచ్చాయని నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ చిప్‌సెట్స్ కలిగిన ఫోన్లను హ్యాకర్లు సులభంగా యాక్సెస్ చేయగలుగుతారని అంటున్నారు. కనుక ఈ చిప్ సెట్స్ కలిగిన ఫోన్లను వాడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
కాగా ఈ విషయంపై క్రిప్టోవైర్ అనే సెక్యూరిటీ సంస్థకు చెందిన చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అలెక్స్ లిస్లె మాట్లాడుతూ.. తాము ఈ విషయాన్ని 2021 డిసెంబర్ నెలలోనే గుర్తించామని.. సంబంధిత కంపెనీకి ఈ విషయమై హెచ్చరికలు కూడా చేశామని తెలిపారు. అయితే ఆ చిప్ సెట్‌లో తలెత్తిన లోపాల కారణంగా యూజర్ల డేటాకు ముప్పు ఏర్పడిందని.. కనుక వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.