Tomato Pandu Mirchi Nilva Pachadi : ట‌మాటా పండు మిర్చి నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Pandu Mirchi Nilva Pachadi : ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి.. ట‌మాటాలు, పండుమిర్చి క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. పండుమిర్చితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి కూడా చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌చ్చ‌డి త‌యారు చేయ‌డం రాని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని సుల‌భంగా అర‌గంటలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, త‌రిగిన నాటు ట‌మాటాలు – 500 గ్రా., ఉప్పు – 2 టీ స్పూన్స్, ప‌సుపు – ఒక టేబుల్ స్పూన్, చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, నాటు పండుమిర్చి – అర‌కిలో , వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

Tomato Pandu Mirchi Nilva Pachadi recipe in telugu make in this method
Tomato Pandu Mirchi Nilva Pachadi

ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ప‌చ్చ‌డి త‌యారీ చేసుకోవ‌డానికి ముందు రోజే ట‌మాటాల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. అలాగే పండుమిర్చిని కూడా తొడిమెలు తీయ‌కుండా క‌డిగి తుడిచి ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ట‌మాటాల‌ను ముక్క‌లు క‌ట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి. ట‌మాటాలు స‌గానికి పైగా ఉడికిన త‌రువాత చింత‌పండు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాటాల‌ను పూర్తిగా ఉడికించుకుని స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి. త‌రువాత వీటిపై ఉండే మూత తీసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. ట‌మాట ముక్క‌లు చ‌ల్లారిన త‌రువాత జార్ లో పండుమిర్చి తొడిమెల‌ను తీసేసి ముక్క‌లుగా తుంచి వేసుకోవాలి.

ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉడికించిన ట‌మాట ముక్క‌ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసిన ప‌చ్చ‌డిని గాజు సీసాలో లేదా జాడీలో వేసి నిల్వ చేసుకోవాలి. మ‌న‌కు కావ‌ల్సిన‌ప్పుడు ఆవాలు, జీల‌క‌ర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లితో తాళింపు పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. పండుమిర్చి ల‌భించిన‌ప్పుడు వాటితో ఇలా రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని సంవ‌త్స‌ర‌మంతా తిన‌వ‌చ్చు.

D

Recent Posts