Tomato Pulao : ట‌మాటా పులావ్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Tomato Pulao : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌క ధ‌ర క‌లిగిన కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. వీటిని మనం త‌ర‌చూ వంటల్లో వేస్తుంటాం. టామ‌టాల‌ను ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి చాలా మంది తింటారు. అలాగే నేరుగా ప‌చ్చడి, ప‌ప్పు వంటివి కూడా చేస్తుంటారు. అయితే ట‌మాటాల‌తో పులావ్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tomato Pulao very tasty make in this method
Tomato Pulao

టమాట పులావ్ ను మామూలు సన్న బియ్యంతో చేసుకోవచ్చు. లేదంటే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఏ బియ్యంతో చేసుకున్నా రుచి బాగా వ‌స్తుంది. ఇక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, పచ్చి మిర్చి, మసాలా దినుసులైన జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యాని ఆకుల‌ను తీసుకోవాలి. వీటితో పులావ్‌ను చేయ‌వ‌చ్చు.

టమాట పులావ్ ను రైస్ కుక్కర్ లో లేదంటే మామూలు గిన్నెలో కూడా వండుకోవచ్చు. ముందుగా ఓ గిన్నె తీసుకోండి. దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి. తర్వాత రుచి కోసం కొంచెం డాల్డా వేసుకోండి. డాల్డా కాగాక. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పైన చెప్పుకున్న మసాలా దినుసులన్నింటినీ వేసి బాగా కలపండి.

ఒకవేళ మీకు డాల్డా నచ్చకపోతే డాల్డా బదులు నెయ్యి వేసుకోవ‌చ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి దోరగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత టమాట ముక్కలు వేయండి. దోరగా వేగాక.. ముందే నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి దానికి సరిపడా నీళ్లు పోయండి. త‌రువాత బాగా ఉడికించండి. నీళ్ల‌న్నీ ఇంకిపోయి బియ్యం ఉడికితే చాలు.. టమాట పులావ్ రెడీ అయినట్టే. తర్వాత దాని మీద కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసిన ట‌మాటా పులావ్‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని నేరుగానే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా కూర‌తోనూ క‌లిపి తిన‌వ‌చ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది.

Editor

Recent Posts