Dates : ఎండు ఖర్జూరాలు అంటే సహజంగానే అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని సాధారణంగా తీపి వంటకాల్లోనే వేస్తారు. అయితే ఎండు ఖర్జూరాలను వాస్తవానికి మనం రోజూ తినవచ్చు. ముఖ్యంగా వీటిని తేనెలో నానబెట్టి తింటే మనకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పూట ఒక చిన్న కప్పులో తేనె తీసుకుని అందులో 3 ఖర్జూరాలను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ తేనెతో సహా ఆ ఖర్జూరాలను తినాలి. దీన్ని పరగడుపునే తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. ఇలా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, ఎండు ఖర్జూరాలు.. రెండూ మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఖర్జూరాలు మనకు తక్షణ శక్తిని ఇచ్చి మనల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. ఉదయాన్నే మనకు అధిక మొత్తంలో శక్తి కావాలి. కనుక ఖర్జూరాలను తింటే ఆ శక్తి లభిస్తుంది. దీంతో ఉదయాన్నే యాక్టివ్‌గా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. అలాగే తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక సీజనల్‌గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. దీంతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. కనుక ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపునే తినాలి.
ఎండు ఖర్జూరాలు, తేనె మిశ్రమాన్ని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. హాయిగా నిద్రపడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అలాగే గాయాలు కూడా సులభంగా మానుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కనుక చిన్నారులు చదువుల్లో యాక్టివ్‌గా మారుతారు. తెలివితేటలు పెరుగుతాయి. ఇక ఈ మిశ్రమంలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తహీనత సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని రోజూ తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.